జేఈఈ మెయిన్స్‌లో శ్రీరామానుజ విద్యార్థుల ప్రతిభ
బీచ్‌రోడ్డు: జేఈఈ మెయిన్స్‌లో పెదవాల్తేరులోని శ్రీరామానుజ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివ రామ దత్తాత్రేయ మాట్లాడుతూ తమ విద్యార్థులు 99.493, 98.709, 98.619, 96.660, 96.454, 95.421 పర్సంటైల్‌తో టాప్ స్కోర్లు సాధించారని తెలిపారు. అలాగే ఫిజిక్స్‌లో అత్యధికంగా 99.738, కెమిస్ట్రీలో 99.717, మ్యాథ్స్‌లో 98.515 పర్సంటైల్ సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ర్యాంకర్లను ఆయన ఘనంగా సత్కరించారు.


