జిల్లాలో రేషన్ దుకాణాలు లబ్ధిదారులు ప్రతి నెలా ఇచ్చే బ
జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి.
అడిగితే తిరగబడుతున్నారు..
ఈనెల 7వ తేదీన సీతంపేట ఏరియాలో ఉన్న రేషన్ డిపోకు వెళ్లాను. మా కుటుంబంలో నలుగురికి గాను 20 కిలోల బియ్యం తీసుకున్నాను. బియ్యం తక్కువగా ఉన్నాయన్న అనుమానంతో మా ఇంటి పక్కన ఉన్న చిన్న కిరాణా షాపులో తూకం వేయగా 18 కిలోలు వచ్చాయి. డీలర్‌ను అడిగితే ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాకు వచ్చిన బియ్యంలో కోత పడుతోంది. అందుకే కార్డుదారుల మీద భారం వేస్తున్నట్టు డీలర్ చెప్పడంతో అవాక్కయ్యాను.
– పి.లత, కనకమ్మవారి వీధి, సీతంపేట
చర్యలు తప్పవు
రేషన్ షాపుల్లో అవకతవకలు చేస్తే చర్యలు తప్పవు. తూకాల్లో తేడా వచ్చినా.. వెంటనే నిలదీయండి. ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే ఫలితం ఉండదు. తూకాల్లో మోసం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయండి. ఆకస్మిక తనిఖీలు చేసి నేరం రుజువైతే చర్యలు తీసుకుంటాం. మోసాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలే ప్రవక్తే లేదు.
– వి.భాస్కరరావు,
డీఎస్‌వో, సివిల్ సప్లయిస్ విభాగం


