సుత్తితో భార్య, అత్తపై దాడి
పెందుర్తి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి సుత్తితో ఇంట్లో వీరంగమాడాడు. భార్య, అత్తను తీవ్రంగా గాయపరడంతో పాటు అడ్డుకునేందుకు వచ్చిన వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని దొగ్గవానిపాలెంలో బుధవారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పుణ్యవత్తుల అప్పారావు, అతడి భార్య కనకమహాలక్ష్మి స్థానికంగా నివాసం ఉంటున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. బుధవారం కూడా తీవ్రంగా గొడవపడ్డారు. ఆగ్రహానికి గురైన అప్పారావు ఇంట్లోని సుత్తితో భార్య, అత్త లక్ష్మిల తలలపై కొట్టాడు. అదే సమయంలో నిందితుడు అప్పారావుకు ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో స్థానికులు స్పందించి దాడిలో గాయపడిన వారితో పాటు అప్పారావును స్థానిక సీహెచ్‌సీకి చికిత్స నిమిత్తం తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అప్పారావుపై ఇదే తరహా దాడి ఘటనల్లో గతంలో రెండు కేసులు నమోదయ్యాయి.
సుత్తితో భార్య, అత్తపై దాడి


