అప్పన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్‌కు, శ్రీచరణికి చిత్రపటం, ప్రసాదం అందిస్తున్న ఏఈవో
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని బుధవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్.మానవేంద్రనాథ్‌రాయ్ దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. స్వామి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు.
క్రికెటర్ శ్రీచరణి కూడా.. : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు.
అప్పన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి


