ఉగ్రదాడి మృతులకు ముస్లింల నివాళి
తాటిచెట్లపాలెం: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తాటిచెట్లపాలెంలో ముస్లింలు శాంతియుత ర్యాలీ చేపట్టారు. రైల్వే న్యూకాలనీ జంక్షన్ వద్ద గల మసీదులో శుక్రవారం ప్రార్థనలు పూర్తయిన అనంతరం, ఉగ్ర దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. హింసను విడనాడాలని, ఉగ్రవాదం పూర్తిగా అంతం కావాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో మసీదు పెద్దలతో పాటు ముస్లింలు, చిన్నారులు పాల్గొన్నారు.


