ఉగ్రదాడికి నిరసనగా వైఎస్సార్ సీపీ శాంతి ర్యాలీ
సీతమ్మధార: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అక్కడ నుంచి గుడివాడ గురునాథరావు విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్ సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ప్రపంచం మొత్తం ఖండిస్తుందన్నారు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్న మట్టు పెట్టాలని, బాధితులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రజలందరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాదులను పట్టుకొని ఉరితీయాలని మండిపడ్డారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ ఈ దాడి దేశ సమగ్రతను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడులను సమర్ధంగా తిప్పికొట్టే క్రమంలో దేశ ప్రజలంతా కేంద్రానికి మద్దతు నిలవాలన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట రామయ్య, డిప్యూటీ మేయర్లు కటుమూరి సతీష్, జియ్యాని శ్రీధర్, కార్పొరేటర్లు మొల్లి లక్ష్మీఅప్పారావు, మువ్వల లక్ష్మి, బిపిన్ కుమార్ జైన్, పి.వి.సురేష్, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు పేర్ల విజయ్‌చందర్, గ్రంథాలయం జిల్లా మాజీ చైర్మన్ కొండా రాజీవ్ గాంధీ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నడింపల్లి కష్ణంరాజు, చిన్న జానకి రాము, అధికార ప్రతినిధులు పల్లా దుర్గ, హరి కిరణ్‌రెడ్డి, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు దొడ్డి కిరణ్, పేడాడ రమణ కుమారి, బోని శివరామకష్ణ, మారుతీప్రసాద్, సేనాపతి అప్పారావు, రాయిపురెడ్డి అనిల్, పీలా ప్రేమ్‌కిరణ్, రామిరెడ్డి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.


