వైవిధ్యం కోసం నేర్చుకుంటున్నాను
డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్‌లో బంగ్లాదేశ్, నేపాల్, పశ్చి మబెంగాల్ ప్రాంతాలకు చెందిన డ్యాన్స్‌లు నేర్చుకున్నాను. దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చాను. టర్కీలో జరిగిన పోటీల్లో విజయం సాధించడం మరిచిపోలేను. క్రియేటివ్ డ్యాన్స్‌లకు ఆదరణ ఎక్కువ. అమ్మానాన్నల ప్రోత్సాహంతో పన్నెండేళ్లుగా శిక్షణ పొందుతున్నాను.
– గోక డింపుల్, ఏయూ ఇంజినీరింగ్ విద్యార్థిని
సీతమ్మధార: నగరంలోని ‘స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్’ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేస్తోంది. బాలబాలికలకు వివిధ రకాల నృత్య రీతుల్లో శిక్షణ ఇస్తూ.. వారి సృజనాత్మకతను వెలికితీస్తోంది. భారతీయ శాసీ్త్రయ నృత్యాలైన కథక్, మోహినియాట్టం, ఒడిస్సీ, మణిపురితో పాటు సంబల్పూరి, కోలాటం, రాజస్థానీ, కర్ణాటక, బిహు, పంజాబీ, తెలుగు జానపద, శాసీ్త్రయ నృత్యాల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా నేపాలి, ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాల నృత్యరీతులను కూడా నేర్పిస్తున్నారు. అనకాపల్లి, పెందుర్తి, భీమునిపట్నం, సింహాచలం తదితర ప్రాంతాల నుంచి ప్రతి ఆదివారం సీతమ్మధార ఏపీఎస్‌ఈబీ కాలనీలోని నృత్యాలయానికి విద్యార్థులు వచ్చి మూడు గంటల పాటు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. శ్రీకాకుళం, రాజాం, చీపురుపల్లి ప్రాంతాలకు చెందిన బాల కళాకారులు రెండు, మూడు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక సదస్సుల్లో పాల్గొని సృజనాత్మక నృత్యాంశాలు నేర్చుకుంటున్నారు. ఈ సంస్థకు అనుబంధంగా ఉన్న శ్రీలంక, ఒడిశా, బంగ్లాదేశ్, నేపాల్, కర్ణాటక, కేరళ, కోల్‌కతా వంటి ప్రాంతాల నుంచి శిక్షకులు వచ్చి బాలలకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు ప్రశంసా పత్రాలు అందిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న విద్యార్థులు టర్కీ లోని ఇస్తాంబుల్, బల్గేరియా, సుబంగ్ (ఇండోనేషియా)లలో ప్రతి ఏటా జరిగే అంతర్జాతీయ ఆన్‌లైన్ నృత్య పోటీల్లో పాల్గొని బహుమతులు సాధిస్తున్నారు. థాయిలాండ్,శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాల్లో నిర్వహించే అంతర్జాతీయ ఆహ్వాన నృత్య ప్రదర్శన పోటీలకు హాజరై.. భారతీయ జానపద, శాసీ్త్రయ నృత్యాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు.
బహుభాషా నృత్యాలు బాగుంటాయి
ఒడిస్సీ, కథక్, మణిపురి, కర్ణాటక జానపద నృత్యాలను ప్రదర్శిస్తాను. బహుభాషా నృత్యాలు బాగుంటాయి. అందుకే ఆసక్తిగా నేర్చుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ బాలల సాంస్కృతిక ఉత్సవాల్లో పూజిత చందన (విశాఖ), ఎన్.జోషిత (సింహాచలం)లతో కలసి నృత్య ప్రదర్శనలిచ్చాను. కళాభిమానులు, నిర్వాహకుల అభినందనలు అందుకున్నాం. మన జానపద నృత్యాలకు విదేశాల్లో
చూపుతున్న ఆదరణ.. నాలో ఆసక్తిని మరింత పెంచుతోంది.
–డి.లక్ష్మీస్నేహిత, ఇంటర్ విద్యార్థిని, అనకాపల్లి
వైవిధ్య నృత్యాలకు వేదిక‘స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్’ దేశ విదేశీ నృత్యాల్లో బాల కళాకారులకు శిక్షణ అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలు, ప్రశంసలు
అంతర్జాతీయ ప్రశంసలే ప్రోత్సాహం
విదేశాల్లో భారత దేశ నృత్యాంశాలు ప్రదర్శించేటప్పుడు లభించే ప్రశంసలే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. టర్కీ, ఇండోనేషియా, సింగపూర్, థాయ్‌లాండ్‌లలో ప్రదర్శించే అవకాశాలు లభించడం మరువలేనది. విదేశీ కళాకారులు సైతం భారతీయ శాసీ్త్రయ, జానపద నృత్యాలకు ముగ్ధులవుతున్నారు.
– ఆర్.హర్షిత టీనా,తగరపువలస
సృజనాత్మకత.. నృత్య ఘనత
సృజనాత్మకత.. నృత్య ఘనత
సృజనాత్మకత.. నృత్య ఘనత
సృజనాత్మకత.. నృత్య ఘనత
సృజనాత్మకత.. నృత్య ఘనత