ఓటింగ్‌ను బహిష్కరించిన వైఎస్సార్ సీపీ
తాటిచెట్లపాలెం: జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌పై శనివారం అవిశ్వాస తీర్మానం సందర్భంగా నిర్వహించిన ఓటింగ్‌ను వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బహిష్కరించారు. వీరంతా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు మాట్లాడుతూ డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం విషయంలో కూటమి అడ్డదారుల్లో గెలిచిందని ఆరోపించారు. తమ పార్టీ మహిళా కార్పొరేటర్లకు అర్ధరాత్రి ఫోన్లు చేసి బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, కార్పొరేటర్లు జియ్యాని శ్రీధర్, బానాల శ్రీనివాసరావు, దౌలపల్లి ఏడుకొండలరావు, కోరుకొండ వెంకట రత్న స్వాతి, కె.అనిల్‌కుమార్ రాజు, నక్కెళ్ల లక్ష్మీ సురేష్, సాడి పద్మారెడ్డి, పల్లా అప్పలకొండ, తోట పద్మావతి, చెన్న జానకిరామ్, గుండాపు నాగేశ్వరరావు, కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్, అల్లు శంకరరావు, వావిలపల్లి ప్రసాద్, రెయ్యి వెంకటరమణ, కరజాడ వెంకట నాగ శశికళ, పి.వి.సురేష్, బల్ల లక్ష్మణరావు, గుడివాడ అనూష లతీష్, పార్టీ నాయకులు గొలగాని శ్రీనివాస్, అక్కరమాని మంగరాజు, మొల్లి అప్పారావు, పల్లా దుర్గ, గులిగిందల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


