ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి జర్నలిజం విలువలు లేవు
ఎండీ రాధాకృష్ణ, యాంకర్, డిబేట్‌లో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలి ఏడీసీపీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు
అల్లిపురం: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌కు జర్నలిజం విలువలు లేవని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై డిబేట్‌లు పెడుతూ, అందులో పాల్గొన్న వ్యక్తులు చులకనగా మాట్లాడుతున్న తీరును ఆయన ఖండించారు. ఏబీఎన్ చానల్ ఎండీ రాధాకృష్ణ, యాంకర్ వెంకటకృష్ణ, డిబేట్ పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పార్టీ నాయకులతో కలిసి నగర పోలీస్ కమిషనరేట్‌కి వెళ్లి అడ్మిన్, ఏడీసీపీ డాక్టర్ వి.బి.రాజ్‌కమల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఏబీఎన్ చానల్ తెలుగుదేశం కరపత్రంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్‌తో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లుతుందన్నారు. ఏబీఎన్ చానల్ యాంకర్ వెంకటకృష్ణ సభ్యసమాజం తలదించుకునేలా డిబేట్లు నిర్వహిస్తూ.. అల్లర్లు సృష్టించి.. ఆ నెపం వైఎస్సార్ సీపీపై నెట్టేయాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, అసమర్ధ పాలనతో రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ ఏబీఎన్ చానల్ చేసే పనులు రక్తపాతాన్ని సృష్టిస్తాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పడం వల్లనే కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారన్నారు. ఏబీఎన్ చానల్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ మాట్లాడుతూ డిబేట్స్ పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్న ఏబీఎన్ చానల్‌ను చూసి జర్నలిస్టులే అసహ్యించుకుంటున్నారన్నారు. డిబేట్స్‌కు వచ్చే వ్యక్తులు ఉన్నా దుల్లా మాట్లాడుతున్నారన్నారు. ఏబీఎన్ చానల్‌పై చర్యలు తీసుకోకుంటే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఎస్‌ఏసీ సభ్యులు బాణాల శ్రీనివాసరావు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి పల్లా దుర్గ, మంచా మల్లేశ్వరి, తాడి జగన్నాథరెడ్డి, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్ వెస్లీ, విజయ్‌చందర్, రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యనిర్వాహక అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ్, చెన్నా జానికీరామ్, జి.వి.రవిరాజు, జోనల్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు అంబటి శైలేష్, ముట్టి సునీల్ కుమార్, జగదీష్ రెడ్డి, బోని శివరామకృష్ణ, కర్రి రామారెడ్డి, సనపల రవీంద్ర భరత్, రాయపురెడ్డి అనిల్‌కుమార్, వంకాయల మారుతీ, దేవరకొండ మార్కండేయులు, నీలి రవి, జీలకర్ర నాగేంద్ర, మాజీ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు, ఆల్ఫా కృష్ణ, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కృష్ణంరాజు నడింపల్లి, రెయ్యి డేవిడ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రామరాజు, కార్పొరేటర్లు సాడి పద్మా రెడ్డి, శశికళ, బిపిన్ కుమార్ జైన్, కో ఆప్షన్ సభ్యుడు ఎండి షరీఫ్, పార్టీ నాయకులు పీతల గోవింద్, శ్రీనివాస్‌రెడ్డి, జక్కంపూడి సత్యనారాయణ, తుళ్లి చంద్రశేఖర్, పద్మాశేఖర్, పేర్ల విజయచంద్ర, తదితరులు పాల్గొన్నారు


