పాకిస్థాన్ నుంచి ఆపరేట్.. విశాఖలో లోన్‌ యాప్‌ ముఠా అరెస్ట్‌ | Loan App Gang Arrested In Visakhapatnam, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ నుంచి ఆపరేట్.. విశాఖలో లోన్‌ యాప్‌ ముఠా అరెస్ట్‌

Apr 27 2025 2:45 PM | Updated on Apr 27 2025 3:38 PM

Loan App Gang Arrested In Visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: నగరంలో లోన్‌ యాప్‌ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ లోన్‌ యాప్‌.. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.ఈ ముఠా లోన్ యాప్‌ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోంది. ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 లోన్ యాప్‌లో రూ. 2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నరేంద్ర భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. బంధువులకు పంపించారు. దీంతో అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.

పాకిస్థాన్‌ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించిన పోలీసులు.. ⁠18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54  సిమ్‌లు, రూ.60 లక్షల రూపాయల నగదును ఫ్రిజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement