‘ఎకరా భూమి 99 పైసలకే ఎలా కట్టబెడతారు?’ | CPM Demands To Call Off Agreement of Ursa | Sakshi
Sakshi News home page

‘ఎకరా భూమి 99 పైసలకే ఎలా కట్టబెడతారు?’

Apr 24 2025 4:54 PM | Updated on Apr 24 2025 5:10 PM

CPM Demands To Call Off Agreement of Ursa

విశాఖ:   కూటమి ‍ప్రభుత్వం రాజకీయ అవినీతికి పాల్పడుతోందని సీపీఎం తీవ్రంగా మండిపడింది. ఉర్సా సంస్థకు కటాయించే భూములను వెంటనే రద్దు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈరోజు’(గురువారం) ఉర్సా కంపెనీకి కేటాయించే భూముల్లో పర్యటించారు సీపీఎం నేతలు. దీనిలో భాగంగా మాట్లాడుతూ ‘ నకిలీ సంస్థకు 60 ఎకరాల భూమి కేటాయిస్తారా. 

కూటమి ప్రభుత్వం రాజకీయ అవినీతికి పాల్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనునాయులకు భూ కేటాయింపులు చేస్తున్నారు. ఎకరా భూమిని ఏ విధంగా 99 పైసలకు కట్టబెడతారు. 10 లక్షల అధీకృత పెట్టుబడి ఉన్న కంపెనీకి 3 వేల కోట్ల భూమి కేటాయింపు ఎలా చేస్తారు?, ఉర్సా ఒక టీడీపీ నాయకుడి బినామీ సంస్థగా ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందని టీడీపీ ఎంపీ సోదరుడే స్వయంగా చెప్పారు. 60 ఎకరాల భూ కేటాయింపుపై విచారణ జరిపించాలి’ అని సీపీఎం డిమాండ్ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement