
రుషికొండలో ‘ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్’
అల్లిపురం: రుషికొండ ఐటీ హిల్స్ 3 సమీపంలో 97 ఎకరాల్లో ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ పేరిట టౌన్‌షిప్ నిర్మిస్తున్నట్లు సంస్థ చైర్మన్ కె.మురళీకృష్ణ, ఎండీ కేఎల్ సంతోష్ వెల్లడించారు. నగరంలోని ఒక హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మొదటి దశలో 4,500 నుంచి 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల 180 విల్లాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఫైవ్ స్టార్ హోటల్, ఐటీ టవర్స్, ప్రీమియం అపార్ట్‌మెంట్స్ వంటి నిర్మాణాలు దశల వారీగా వస్తాయన్నారు. 45 వేల చదరపు అడుగుల్లో విశాలమైన క్లబ్ హౌస్ నిర్మిస్తామన్నారు. విశాఖ, తిరుపతిలో ఫైవ్‌స్టార్ హోటళ్లు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని తెలిపారు. అనంతరం వారు ఐకానిక్ సిటీ ఆఫ్ గోల్డ్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.