పెండింగ్ చలాన్ల వసూళ్ల డ్రైవ్
నగరంలో పోలీసుల విస్తృత తనిఖీలు
ఏయూక్యాంపస్: నగరంలో పోలీసులు విస్తృతంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. గతంలో విధించిన చలాన్లు చెల్లించని వాహనదారులను గుర్తిస్తున్నారు. వారి నుంచి బకాయిలను వసూలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం బీచ్‌రోడ్డులో పలు వాహనాలను తనిఖీ చేశారు. వాహన పత్రాలు సక్రమంగా లేని, హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వారికి జరిమానా విధించారు. భారీగా చలాన్లు పేరుకుపోయిన వాహనచోదకుల నుంచి ఆ రుసుం చెల్లించే విధంగా చర్యలు చేపట్టారు.


