వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు ప్రలోభాలు.. ప్రత్యేక విమానాలేంటి?: బొత్స | YSRCP MLC Botsa Satyanarayana Serious On CBN Govt | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు ప్రలోభాలు.. ప్రత్యేక విమానాలేంటి?: బొత్స

Apr 24 2025 1:36 PM | Updated on Apr 24 2025 7:27 PM

YSRCP MLC Botsa Satyanarayana Serious On CBN Govt

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించడం కరెక్ట్‌ కాదని మండిపడ్డారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాజకీయాల్లో​ ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదని హితవు పలికారు. కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారని అన్నారు.

ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తాజాగా విశాఖలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా బొత్స మాట్లాడుతూ.. కశ్మీర్‌లో తీవ్రవాదుల కాల్పులు కారణంగా 26 మంది చనిపోవడం బాధాకరం. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.

వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించారు. నేనెప్పుడూ ఇటువంటి రాజకీయాలను చూడలేదు. రాజకీయాల్లో ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. 11 నెలల మేయర్  పదవి కోసం అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ 11 నెలల కాలంలో ఏం చేస్తారో ప్రజలకు చెబుదాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా మెజార్టీ కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వారందరినీ అభినందిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Botsa: నమ్మించి మోసం చేశారు..  11 నెలల పదవి కోసం ఇన్ని దారుణాలా

Advertisement
 
Advertisement
Advertisement