కోదాడ : జాతీయస్థాయి గోల్‌షూట్‌బాల్ పోటీలకు కోదాడకు చెందిన కుడుముల చరణ్, మండలంలోని మంగళితండాకు చెందిన ఇబ్రహీం ఎంపికై నట్లు పీఈటీలు రాజ్‌కుమార్, మట్టయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27 వరకు మోత్కూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొని ప్రతిభ కనబర్చడంతో జాతీయస్థాయికి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మే 28 నుంచి 30 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలలో వీరు తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొనున్నట్లు తెలిపారు.
ఆర్‌టీఎం నియామకానికి దరఖాస్తులు
నల్లగొండ : నల్లగొండలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ (ఆర్‌టీఎం) తాత్కాలిక ప్రాతిపదికన నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29, 30 తేదీల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.


