టెన్త్‌లో బాలికలదే హవా | - | Sakshi
Sakshi News home page

టెన్త్‌లో బాలికలదే హవా

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

పెరిగిన జిల్లా ర్యాంకు

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలలో సూర్యాపేట జిల్లాలో 98.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. అత్యధిక పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి ఈ కేటగిరిలో జిల్లా రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచింది. గతేడాది 14వ స్థానంలో ఉండగా ఈ సారి ఉత్తీర్ణతశాతం పెరిగింది. ఇమాంపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన నరిగే తేజశ్రీ అత్యధికంగా 583 మార్కులు సాధించింది. ఈసారి ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించాయి.

12,178 మంది పాస్‌

జిల్లాలో మొత్తం 12,351 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా 12,178 మంది పాసై 98.60శాతం ఉత్తీర్ణత సాధించడంతో సూర్యాపేట రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. 173 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇందులో 6376 మంది బాలురు పరీక్ష రాయగా 6272 మంది పాసై 98.37శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 5975 మంది పరీక్ష రాయగా 5906 మంది పాసై 98.85 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో వందశాతం ఉత్తీర్ణత

జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించి సత్తాచాటాయి. జిల్లాలో 112 ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 14 కేజీబీవీలు, మూడు మోడల్‌ స్కూల్స్‌, 17 రెసిడెన్షియల్స్‌ పాఠశాలలు సైతం 100శాతం ఉత్తీర్ణత సాధించి సత్తాచాటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయి.

అక్కల సాయిచరణ్‌ (581), జెడ్పీహెచ్‌ఎస్‌ తిరుమలగిరి

నరిగె తేజశ్రీ(583) జెడ్పీహెచ్‌ఎస్‌,

ఇమాంపేట

పావని(580)

మోడల్‌ స్కూల్‌,

ఇమాంపేట

సహారిక(575)

మైనార్టీ గురుకుల

పాఠశాల హుజూర్‌నగర్‌

గతేడాది పదో తరగతిలో 11,508 మంది విద్యార్థులు పాసై 96.81శాతం ఉత్తీర్ణత సాధించగా సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 12,178 మంది విద్యార్థులు పాసై 98.60 శాతం ఉత్తీర్ణత సాధించడంతో 7వ స్థానానికి ఎగబాకింది. విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించడంపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

ఫ సూర్యాపేట జిల్లాలో

98.60 శాతం ఉత్తీర్ణత

ఫ సత్తాచాటిన ప్రభుత్వ విద్యాలయాలు

ఫ గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత

ఫ రాష్ట్రంలో జిల్లాకు 7వ స్థానం

Advertisement
 
Advertisement
Advertisement