ఫ రాష్ట్ర మార్కెంటింగ్
జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్
చివ్వెంల(సూర్యాపేట) : సాగులో యాంత్రీకరణ ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతు వారోత్సవాల్లో భాగంగా వ్యవసాయ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సాగు యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యంత్రాల సాయంతో సాగు చేయడం వల్ల పెట్టుబడి తగ్గించడంతో పాటు కూలీల కొరతను అధిగమించవచ్చన్నారు. పురుగుల మందులు స్ప్రే చేసేందుకు డ్రోన్‌లను వినియోగించాలన్నారు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్తలు అరుణ కుమారి, సునీత పలు విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. విద్యుత్‌శాఖ డీఈ విద్యాసాగర్ మాట్లాడుతూ పీఎం కుసుమ్ కాంపోటెంట్ పథకం, మోడల్ సోలార్ వేజ్ కార్యక్రమంపై వివరించారు. కార్యక్రమంలో డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీసీఓ ప్రవీణ్‌కుమార్, డీఎంఓ నాగేశ్వర్‌శర్మ, ఏడీఏ జ్ఞానేశ్వరి, ట్రాన్స్‌కో ఏడీఈ రాములునాయక్, టౌన్ ఏడీ శ్రీనివాస్‌రావు, ఏఈ మల్లయ్య, చివ్వెంల, ఆత్మకూర్(ఎస్), పెన్‌పహాడ్, సూర్యాపేట ఏఓలు వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్, దివ్య, కృష్ణ సందీప్, సర్పంచ్‌లు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.


