రసాయన ఎరువులు అధికంగా వాడొద్దు | - | Sakshi
Sakshi News home page

రసాయన ఎరువులు అధికంగా వాడొద్దు

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

గరిడేపల్లి : సాగు భూములు నిస్సారం కోల్పోకుండా ఉండాలంటే రసాయన ఎరువులు, యూరియాను అధికంగా వాడొద్దని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సుకుమార్‌, శ్రీనివారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు మేరకు సోమవారంరాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మండలం పొనుగోడు గ్రామాన్ని శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో వారు మాట్లాడారు. ఏప్రిల్‌ 27 నుంచి మే 23 వరకు శాస్త్రవేత్తలు నేరుగా గ్రామాలకే వచ్చి రైతులకు సాగులో మెళకువలు నేర్పుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కటకం వేణు, మండల వ్యవసాయ అధికారి ప్రీతం కుమార్‌, ఏఈఓ మనోజ్‌, రైతులు కటకం రమేష్‌, కటకం గోపయ్య, సుందరి నాగేంద్రబాబు, దేవిరెడ్డి, లింగయ్య, సత్యనారాయణరెడ్డి రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement