ఆర్యవైశ్యులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఆర్యవైశ్యులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

Apr 27 2026 8:42 AM | Updated on Apr 27 2026 8:42 AM

ఆర్యవైశ్యులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని, ఏ ప్రభుత్వం చేయని విధంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నదని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వల చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమ్మవారి త్యాగాన్ని గుర్తించి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. వారికి సముచిత స్థానం కల్పించేందుకు సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా మొరిశెట్టి నివేదితకు అవకాశం కల్పించిందని చెప్పారు. వాసవిమాత జయంతిని వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మొరిశెట్టి నివేదిత, వైస్‌ చైర్మన్‌ షఫీ ఉల్లా, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ గట్టు శ్రీనివాస్‌, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, సంక్షేమ అధికారి కె.నరసింహారావు, యువజన సంక్షేమ అధికారి వెంకట్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు, కోశాధికారి లక్ష్మీకాంత్‌, పట్టణ అధ్యక్షుడు మంచాల రంగయ్య, కార్యదర్శి కలకోట లక్ష్మయ్య, బండారు రాజా, తోట శ్యాం ప్రసాద్‌ పాల్గొన్నారు.

పర్యాటక అభివృద్ధి

కార్పొరేషన్‌ చైర్మన్‌ పటేల్‌ రమేష్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement