తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత కేసీఆర్‌దే | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత కేసీఆర్‌దే

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

సూర్యాపేట టౌన్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పాలనలో అడుగుఅడుగునా అణచివేతకు గురైన తెలంగాణను ఉమ్మడి పాలన నుంచి విముక్తి చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసింది బీఆర్‌ఎస్‌ అన్నారు. కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ప్రాణాలకు తెగించి కేసీఆర్‌ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, వై.వెంకటేశ్వర్లు, అనిల్‌రెడ్డి, అమరవాది శ్రవణ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement