ప్లేట్లు, గ్లాసులు, ఇంటి నుంచే.. | - | Sakshi
Sakshi News home page

ప్లేట్లు, గ్లాసులు, ఇంటి నుంచే..

Apr 25 2026 9:24 AM | Updated on Apr 25 2026 9:24 AM

సూర్యాపేట : పట్టణంలోని నంబర్‌– 2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జనగణనపై ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కొందరు ఉపాధ్యాయులు పేపర్‌ప్లేట్లను వినియోగించకుండా తమ ఇంటి వద్ద నుంచి స్టీల్‌ ప్లేట్లను తెచ్చుకుని అందులోనే భోజనం చేశారు. మంచినీళ్లు తాగడానికి స్టీల్‌ వాటర్‌ బాటిల్‌, టీ తాగడానికి స్టీల్‌ గ్లాసులు తెచ్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు వారు చేస్తున్న కృషిని గ్రీన్‌క్లబ్‌ అధ్యక్షుడు ముప్పాని నరేందర్‌తో పాటు అధికారులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement