విధుల నుంచి కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎం తొలగింపు | - | Sakshi
Sakshi News home page

విధుల నుంచి కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎం తొలగింపు

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

సూర్యాపేట టౌన్‌ : పట్టణ పరిధిలోని రాజీవనగర్‌ యూపీహెచ్‌సీలో కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న పోలేటి నాగమణిని జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ పెండెం వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిశు విక్రయం కేసులో నాగమణి పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరకడంతో అరెస్టు చేసి జైలు పంపించామన్నారు. ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణలో భాగంగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగమణిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. శాఖలో పని చేసే ఉద్యోగులు విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

లేబర్‌ కోడ్‌ల రద్దుకు పోరాడుదాం

సూర్యాపేట అర్బన్‌ : కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లో రద్దు చేసేవరకూ పోరాడుదామని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య అన్నారు. సూర్యాపేటలో సోమవారం ఐఎఫ్‌టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేడే పోస్టర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. మేడే వేడుకలను గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, హమాలీ యూనియన్‌ అధ్యక్షుడు దొనకొండ సైదులు, పురుషోత్తం, గురుమల్లు, పాలబిందేల వెంకన్న, రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement