కోదాడ : జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ విధిగా పాల్గొని, వివరాలను అందించాలని సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ రఘు అనుమోలు సూచించారు. శుక్రవారం కోదాడలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎన్యూమరేటర్ ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు. కోదాడ పట్టణాన్ని 141 లిస్టింగ్ బ్లాక్‌లుగా విభజించి 131 మంది ఎన్యూమరేటర్లు, 22 మంది సూపర్‌వైజర్ల సాయంతో జనగణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని బ్లాక్‌నెం 78లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ 95 శాతం చేయించిన జూలకంటి సమత, సూపర్‌వైజర్ సాదె లక్ష్మీనారాయణను ఆయన అభినందించారు. ఆయన వెంట జిల్లా జనగణన అధికారి ఇస్లావత్ హోబలాల్, పట్టణ అసిస్టెంట్ అధికారి జి.రమేష్, తీగల నరేష్, ఆర్.నర్సింహారెడ్డి, కంటెం వేణుబాబు, పారా వీరయ్య, ఇస్మాయిల్ ఉన్నారు.


