భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు పట్టి ఈదురుగాలులు వీచాయి. అక్కడక్కడ వర్షం కురిసింది. దాంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు తీశారు. సూర్యాపేట మార్కెట్ యార్డులో రైతులు పోసిన ధాన్యం కొంత మేరకు తడిసింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పగలు ఎండ.. సాయంత్రం వర్షం
జిల్లాలో మూడు నాలుగు రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఆదివారం కూడా ఉదయం 9 గంటల నుంచే ఎండతీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఈదురుగాలులతో కూడిన జల్లులు పడ్డాయి.
రైతుల పరుగులు
సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆకా శం మేఘావృతమై ఈదురుగాలు వీయడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. ధాన్యం రాశులపై పట్టాలను కప్పుకునేందుకు ప్రయత్నించగా ఈదురు గాలుల ధాటికి కొట్టుకుపోవడంతో ఇబ్బంది పడ్డారు. చివ్వెంల, నాగారం, అర్వపల్లి మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు, తిరుమలగిరి మార్కెట్‌లో పోసిన మక్కలు కొద్దిమేర తడిశాయి. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం ధాన్యం అమ్ముకునేందుకు ఆదివారం మధ్యాహ్నం నుంచి రైతులు తీసుకు వచ్చిన ధాన్యం రాశులు కొంత మేరకు తడిశాయి. మార్కెట్ సిబ్బంది అందించిన పట్టాలు ఈదురు గాలులకు లేచి పోయా యి. వర్షం పెద్దగా రాకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
ఫ పలు ప్రాంతాల్లో ఈదురు
గాలులతో కూడిన మోస్తరు వర్షం
ఫ తడిసిన ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం
ఫ నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
ఫ విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం


