ర్యాలీని ప్రారంభిస్తున్న జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, పట్టణంలో వాహనాల ర్యాలీ
సూర్యాపేటటౌన్ : అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాలని జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి కోరారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంలో అగ్నిమాపక వాహనాల ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ ర్యాలీ శంకర్ విలాస్ సెంటర్ మీదుగా కొత్త బస్టాండ్, ఖమ్మం రోడ్డు, పాత బస్టాండ్ నుంచి అగ్నిమాపక కేంద్రం వరకు సాగింది. అనంతరం షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు వంటి జన సమూహ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.


