కోదాడ : సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది ఉదయం కోదాడ డిపో గేటు వద్ద బైఠాయించి లోపలి నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. కోదాడ పట్టణ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు డిపో వద్దకు వచ్చి కార్మికులను బలవంతంగా అక్కడి నుంచి తొలగించారు. ఆర్టీసీ అధికారులు కొన్ని బస్సులను ప్లాట్‌ఫాం వద్దకు తీసుకొచ్చిన తరువాత కూడ కార్మికులు వాటిని అడ్డుకున్నారు. విజయవాడ– హైదరాబాద్ మధ్య నడిచే ఏపీ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు యథావిధిగా నడిచాయి. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.


