కోదాడరూరల్ : కోదాడకు అదనపు జిల్లా న్యాయస్థానాన్ని మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు హైకోర్టు జడ్జిలను కలిసి విజ్ఞప్తి చేశారు. కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్.లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో హైకోర్టు పోర్ట్‌పోలియో జడ్జి మాధవిదేవి, బిల్డింగ్ కమిటీ సభ్యుడు, హైకోర్టు జడ్జి కార్తీక్ విజయసేనారెడ్డిలను వారి చాంబర్‌లలో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కోదాడలో కేసుల సంఖ్య, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు అవసరాన్ని వారు వివరించారు. నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవన పనులు త్వరగా పూర్తి అయ్యేలా అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు. జడ్జిలను కలిసిన వారిలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు రామిశెట్టి రామకృష్ణ, గట్ల నరసింహారావు, కోడూరు వెంకటేశ్వరరావు, గాలి శ్రీనివాస్‌నాయుడు, దేవబత్తిని నాగార్జున, సుధాకర్‌రెడ్డి, పాలేటి నాగేశ్వరరావు, ఈదుల కృష్ణయ్య, నాగుబండి కృష్ణమూర్తి, అబ్దుల్‌రహీం, కేఎల్‌ఎన్ ప్రసాద్ ఉన్నారు.


