సూర్యాపేట టౌన్ : డెంగీ బారిన పడకుండా ఉండాలంటే దోమల నివారణకు ఇళ్ల పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ)డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట పట్ణంలోని గిరినగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయ న మాట్లాడారు. కూలర్లు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, పూల కుండీలు, నీటి ట్యాంకులు వంటి ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూ సుకోవాలన్నారు. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కోటి రత్నం, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ ప్రణీత్, ఎస్‌వో వీరయ్య, డిప్యూటీ డెమో సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామికి విశేష పూజలు
ఐకేపీ కేంద్రంలో బస్తాలు, టార్పాలిన్లు దగ్ధం
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం అర్థరాత్రి గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి మంటలు రావడంతో స్థానికులు, కేంద్రం నిర్వాహకులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో సూర్యాపేట నుంచి ఫైర్ ఇంజన్‌ను పిలిపించి మంటలు ఆర్పివేయించారు. అప్పటికే 3,800 ఖాళీ గన్నీ బ్యాగులు, 6 టార్పాలిన్లు కాలిపోయాయి. సమీపంలోనే ఉన్న ఓ రైతు ధాన్యం రాశికి మంటలు అంటుకోగా నీళ్లుపోసి ఆర్పారు. సంఘటన స్థలాన్ని శనివారం సూర్యాపేట ఆర్‌డీఓ వేణుమాధవరావ్ సందర్శించారు. గుర్తుతెలియని వ్యక్తులు గన్నీబ్యాగులు, టార్పాలిన్లను దహనం చేశారని కేంద్రం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలిపోయిన సామగ్రి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఆయన వెంట అదనపు డీఆర్‌డీఓ సురేష్, డీపీఎంలు అరుణ్, బెనర్జీ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్‌ఐ సైదులు, ఏపీఎం రాంబాబు, సీసీలు నగేష్, నాగార్జున ఉన్నారు.


