నేరేడుచర్ల : హిందూ అనేది మతం కాదని ఒక జాతి మాత్రమేనని జగిత్యాల ధర్మరక్షణ పీఠాధిపతి లక్ష్మీనారాయణ స్వామిజీ అన్నారు. ఆదివారం నేరేడుచర్లలోని కేఎస్‌ఎస్ ఫంక్షన్‌హాల్లో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మం సూత్రాన్ని పాటించాలని, మానవీయ కోణతంలో అందరూ ఒక్కటిగా ఉండాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు కులం, మతం లేదన్నారు. హిందూ ధర్మాన్ని పాటించే వారంతా పూజారులుగా కొనసాగవచ్చన్నారు. అఖిల భారత ధర్మజాగరణ ప్రముఖ్ ఆలే శ్యాంకుమార్ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ దేశంలోని లక్ష గ్రామాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తుందన్నారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కళ్లెం స్వప్న, మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకట్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, నాయకులు నాగండ్ల శ్రీధర్, అప్పిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, రామ్మోహన్‌రావు, కొణతం సీతారాంరెడ్డి, రామకోటేశ్వర్‌రావు, లక్ష్మీనారా యణ, ఆదిరెడ్డి, శ్రీనివాసారావు, వెంకటేశ్వర్లు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
ఫ ధర్మరక్షణ పీఠాధిపతి లక్ష్మీనారాయణ స్వామిజీ


