30న టీపీటీఎఫ్‌ విద్యా సదస్సు | - | Sakshi
Sakshi News home page

30న టీపీటీఎఫ్‌ విద్యా సదస్సు

Apr 21 2026 6:07 AM | Updated on Apr 21 2026 6:07 AM

నూతనకల్‌ : హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 30న నిర్వహించే విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న కోరారు. సోమవారం మండల కేంద్రంలో మండల నోడల్‌ అధికారి డి. శివయ్య ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యా సమస్యల పరిష్కార, నేటి సమాజానికి అవసరమైన విద్యా అభివృద్ధి కోసం నిర్వహించే సదస్సుకు ఉపాధ్యాయులు, మేఽథావులు హాజరు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఢీకొండ మహేష్‌, కంఠ భిక్షం, హనుమంతు, కృష్ణవేణి, నారాయణదాసు శ్రీనివాస్‌, శ్రీనివాస్‌రెడ్డి, వెంకన్న, ఉపేందర్‌, బాలాజీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement