మేళ్లచెరువు : మండల కేంద్రంలోని శ్రీఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభుశంభులింగేశ్వరస్వామి ఆయలంలో సోమవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన అనంతరం గోపూజ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు.
వైభవంగా అధ్యయనోత్సవాలు
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం అధ్యయనోత్సవాల పూజలను అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్వారాదులకు ప్రత్యేక అర్చనలు, మహానివేదన గావించి తీర్థప్రపాదాలు అందజేవారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశి ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, అనంతాచార్యులు, నరసింహాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
ఎంజీయూలో
ప్రయోగశాలలు ప్రారంభం
నల్లగొండ టూటౌన్ : ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ వివిధ ప్రయోగశాలలను ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రేఖ, హరీష్ కుమార్, జయంతి, సుధారాణి, సాంబశివరావు పాల్గొన్నారు.
చరిత్ర అధ్యయనానికి శాసీ్త్రయ పద్ధతులు తప్పనిసరి
నల్లగొండ టూటౌన్ : చరిత్ర అధ్యయనంలో ఖగోళ శాస్త్రం, శాసీ్త్రయ పద్ధతులు, పరిశోధనా విధానం వంటి అంశాలు అవసరమని ఎంజీయూ చరిత్ర విభాగం ప్రొఫెసర్ కె.అశోక్ అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో యువత కోసం చరిత్ర, చరిత్ర రచన ఎందుకు, ఎలా అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. గతాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వర్తమానాన్ని సమర్థంగా విశ్లేషించి, భవిష్యత్తును సముచితంగా నిర్మించుకోవడమే చరిత్ర అన్నారు. కార్యక్రమంలో చరిత్ర విభాగం అధ్యాపకులు విజయబాబు, పనస రామకృష్ణ, షరీఫ్, శ్రీనివాస్, వివేక్, విద్యార్థులు పాల్గొన్నారు.


