విత్తనాల ఎంపికలో జాగ్రత్త వహించాలి | - | Sakshi
Sakshi News home page

విత్తనాల ఎంపికలో జాగ్రత్త వహించాలి

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

మోతె : వానకాలం సీజన్‌లో సాగుకు ముందు రైతులు విత్తనాలను సిద్ధం చేసుకోవాలని, వాటి ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ సూచించారు. సోమవారం మండలంలోని రావిపహాడ్‌ గ్రామ రైతువేదికలో రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువుల పిచికారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. మితిమీరిన ఎరువుల వినియోగంతో భూసారం తగ్గి పంట దిగుబడి తగ్గుతుందన్నారు. నూతన వరి వంగడాలు, సేంద్రియ వ్యవసాయం, పంటమార్పిడిపై ఒక్క రోజు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అరుణ, ఏఈఓ త్రివేణి, ఉద్యానవన అధికారి అనిల్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement