పెన్‌పహాడ్: కొనుగోలు కేంద్రాల్లో తూకం పూర్తయిన ధాన్యం బస్తాలను వెంటనే లారీల్లో రైస్ మిల్లులకు తరలించి దిగుమతి చేసుకునేలా చూడాలని అదనపు కలెక్టర్ భూక్య హరిసింగ్ అన్నారు. బుధవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామ శివారులోని మహాదేవ్ రైస్ మిల్లును తనిఖీ చేసి మాట్లాడారు. అవసరమైతే హమాలీల సంఖ్య పెంచుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఐ రంజిత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
సూర్యాపేటలో పరీక్ష రాస్తున్న విద్యార్థులు
తిరుమలగిరిలో సెంటర్ గేట్ వద్ద నిరీక్షిస్తున్న విద్యార్థులు


