త్వరలో ఉపాధ్యాయులకు హెల్త్‌ కార్డులు | - | Sakshi
Sakshi News home page

త్వరలో ఉపాధ్యాయులకు హెల్త్‌ కార్డులు

Apr 25 2026 9:24 AM | Updated on Apr 25 2026 9:24 AM

సూర్యాపేటటౌన్‌ : హెల్త్‌ కార్డుల ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, నెల రోజుల్లోపే ఉపాధ్యాయులందరికీ నగదు రహిత హెల్త్‌ కార్డులు మంజూరు కానున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేటలోని ఐఎంఏ ఫంక్షన్‌హాల్లో శుక్రవారం జరిగిన పసునూరి వెంకట్రాంరెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగుల వయో పరిమితి పెంపు, మెరుగైన పీఆర్సీ, పదోన్నతులు, బదిలీలు వంటివి పీఆర్టీయూ కృషి మూలంగానే సాధ్యమయ్యాయన్నారు. రాబోయే కాలంలో మంచి పీఆర్సీ ఇప్పించడంతో పాటు జూలైలో బదిలీలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రెండు విడతల్లో మొత్తం పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఏఐసీసీ సభ్యుడు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం బాగుపడాలంటే అది ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు పందిరి విష్ణుకుమార్‌, సంఘం నాయకులు బాణాల శ్రీనివాస్‌రెడ్డి, పప్పుల వీరబాబు, కందుకూరి శివశంకర్‌, షరీఫున్నిసా బేగం, గోలి వెంకటకృష్ణారెడ్డి, రామలింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఫ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement