బీఆర్‌ఎస్‌ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

హుజూర్‌నగర్‌ : బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రహస్య పొత్తులు పెట్టుకుని బీఆర్‌ఎస్‌ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌.. తమ ఎమ్మెల్యేలపై దాడి చేయించడం హేయమైన చర్య అన్నారు. కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను బండి సంజయ్‌ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో హింస పాలన నడుస్తోందని, ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని విమర్శించారు. సమస్యలను దాన్ని పక్కదారి పట్టించేందుకే డైవర్షన్‌న్‌ పాలిటిక్స్‌ చేస్తూ కాంగ్రెస్‌ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఎవరు ఎన్ని దాడులు చేసినా, కవ్వించినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ సభతో కాంగ్రెస్‌, బీజేపీలకు భయం పట్టుకుందని అన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ నాయకులు వి.నరసింహారెడ్డి, పిల్లుట్ల రఘు, మారిపెద్ది శ్రీనివాస్‌, జక్కుల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

ఫ మాజీ మంత్రి,

సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement