రాశులు దండిగా! | - | Sakshi
Sakshi News home page

రాశులు దండిగా!

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

న్యూస్‌రీల్‌

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సంతలో పెట్టాలి

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌

నిర్మాణాలను తొలగించాలి

వాలీబాల్‌ నేర్చుకుందాం..
వేసవి సెలవుల్లో కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో వాలీబాల్‌ క్రీడలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
మార్కెట్‌ చిన్నగా..

సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026

- 8లో

తిరుమలగిరి (తుంగతుర్తి) : ఉమ్మడి జిల్లాలోనే రెండవ అతి పెద్దదైన తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో స్థలం కొరత వేధిస్తోంది. ఈ మార్కెట్‌కు సంవత్సరం పొడవునా ధాన్యం, వేరుశనగ, మొక్కజొన్న, కందులు, పెసళ్లు వస్తుంటాయి. యాసంగి, వానాకాల సీజన్ల సమయంలో భారీగా ధాన్యం వచ్చినప్పుడు స్థలం సరిపోవడం లేదు. ప్రతి సీజన్‌లో రోజూ పదివేల నుంచి 30 వేల బస్తాల ధాన్యంతో పాటు ఇతర పంట ఉత్పత్తులను రైతులు తీసుకొస్తారు. 20 వేల బస్తాల కంటే ఎక్కువ ధాన్యం వచ్చిన రోజు స్థలం సరిపోక మార్కెట్‌లోని రెండు గేట్ల ముందు నుంచి లోపలికి వెళ్లే దారిలో సైతం ధాన్యం రాశులు పోస్తున్నారు. దీంతో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది.

తొమ్మిదిన్నర ఎకరాల్లో మార్కెట్‌

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ 1973 వరకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు అనుబంధంగా ఉండేది. 1993లో సూర్యాపేట–జనగామ ప్రధాన రహదారి వారాంతపు స్థలం పక్కన ఉన్న తొమ్మిదిన్నర ఎకరాల్లో ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్‌ అభివృద్ధి చెందుతుండడంతో మార్కెట్‌ కార్యాలయం, రైతు విశ్రాంతి భవనం, ఈనామ్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. గోదాములతోపాటు వర్షం వస్తే పంట ఉత్పత్తులు తడవకుండా 9 రేకుల షెడ్లు నిర్మించారు. నాలుగు ఎకరాలలో గదులు, గోదాములు, చెట్లు పోను మిగతా ఐదున్నర ఎకరాల్లో ఓపెన్‌ ప్లాట్‌ఫారం ఉంది.

కొత్తగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం

మార్కెట్‌లో కొత్తగా గతనెల 20న మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లాలో సూర్యాపేట,తిరుమలగిరి మార్కెట్‌లలోనే కేంద్రం ఏర్పాటు చేశారు. రైతులు తిరుమలగిరికే మొక్కజొన్న పంటను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో 90 రాశులు పోశారు. 15 వేల బస్తాల మొక్క జొన్నలను మార్కెట్‌కు తీసుకొచ్చారు. దీనికి తోడు మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన 3 వేల బస్తాలు ఎగుమతి కాగా 10 వేల బస్తాలు మార్కెట్‌లోఉన్నాయి. మొక్క జొన్నల ఎగుమతులు, కాంటాలు కాక ఆలస్యమవుతున్నాయి. ఒక్కో రైతు తీసుకొచ్చిన మొక్క జొన్నల అమ్మకానికి పది రోజులకు పైగా సమయం పడుతోంది. రైతులు రోజూ వచ్చే ధాన్యంతోపాటు ఇతర పంటలు తీసుకొస్తుండడంతో మార్కెట్‌లో స్థలం సరిపోవడం లేదు. ఎగుమతులు ఆలస్యం అవుతుండడంతో మార్కెట్‌ ఒకరోజు నడిస్తే రెండు రోజులు సెలవులు ఇవ్వాల్సివస్తోంది.

బాధితుల ఇంటి వద్ద

నుంచే కేసులు నమోదు

సూర్యాపేటటౌన్‌ : పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే సంఘటనలపై బాధితుల ఇళ్లకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడి నుంచే కేసు నమోదు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాధితుల ఇంటి వద్ద నుంచే కేసు నమోదు, ఎఫ్‌ఐఆర్‌ ఎట్‌ డోర్‌ స్టెప్‌ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ పటిష్టంగా ముందుకు తీసుకెళ్తూ బాధితులకు ఇంటివద్దే పోలీసు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సంఘటనలపై సమాచారం అందుకున్న వెంటనే వేగంగా బాధితుల ఇంటికి సంబంధిత పోలీసు అధికారులు చేరుకుని పారదర్శకమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వారం రోజుల్లో బాధితుల ఇంటి వద్దకు వెళ్లి 111 కేసులు నమోదు చేశామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమస్యలపై డయల్‌ 100, ఫోన్‌ ద్వారా సమాచారం అందించి పోలీస్‌ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండానే కేసులు నమోదు చేసుకోవాలని కోరారు.

మెరుగైన విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలి

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యాలయాల్లో కార్పొరేట్‌ స్థాయిలో సౌకర్యాలు కల్పించడం ద్వారా సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు విద్య, వైద్యం ఉచితంగా అందించవచ్చని డీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన డీటీఎఫ్‌ ఐదవ జిల్లా వార్షిక కౌన్సిల్‌ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి మాట్లాడుతూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌ విధానం అమలు చేయకుండా ప్రభుత్వం సుప్రీం కోర్టు లో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయడం సరికాదన్నారు. మొత్తంగా సీపీఎస్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. డీఏలు మంజూరు చేయడంలో, పీఆర్‌సీ అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొచ్చెర్ల వేణు, బీవీ రావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎ.పున్నయ్య, బి.వెంకటేశం, పి.వెంకులు, సత్తయ్య, వెంకటేశ్వర్లు, జె. రమణ, జి.ఆనంద్‌ భాస్కర్‌, సీహెచ్‌.సింహాద్రి, బి. క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ప్రజావాణి

భానుపురి (సూర్యాపేట) : ఇక నుంచి ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌ లాల్‌ పవార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్‌ స్థాయి ప్రజావాణికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆర్డీఓలను ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో మాత్రమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించామని, అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక పై ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి ఉంటుందని స్పష్టం చేశారు. డివిజన్‌ సాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజనల్‌ అధికారి నిర్వహిస్తారని తెలిపారు. డివిజన్‌ పరిధిలోని డివిజనల్‌ అధికారులు అందరూఈ ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు.

డీఎస్పీ కార్యాలయాల్లోకూడా పోలీస్‌ ప్రజావాణి

సూర్యాపేటటౌన్‌ : ఇక నుంచి ప్రతి సోమవారం డివిజన్‌ స్థాయిలో డీఎస్పీ కార్యాలయాల్లో కూడా పోలీస్‌ ప్రజావాణి ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్‌ పరిధిలోని ప్రజలు వారి సమస్యలపై డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించే పోలీస్‌ ప్రజావాణి కార్యక్రమంలో డీఎస్పీలకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కోదాడ, సూర్యాపేట డీఎస్పీ కార్యాలయాలలో పోలీస్‌ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలి పారు. డీఎస్పీ కార్యాలయాల్లో ప్రజా వాణికి అన్ని ఏర్పాట్లు చేయాలని డీఎస్పీలను ఆదేశించారు. ప్రజలు, బాధితులు, ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు.

ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ధరించనున్న

బ్రాండ్‌ అంబాసిడర్‌ రష్మీ ఠాకూర్‌

ఫ కోదాడ మున్సిపాలిటీలో

అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల సంఖ్యలో తేడా

ఫ 22 ఏజెన్సీల ద్వారా

పనిచేస్తున్న కార్మికులు

ఫ ఎవరు.. ఎక్కడ పని చేస్తున్నారో అధికారులకే తెలియని పరిస్థితి

ఫ మూడు రోజుల క్రితం ఫిజికల్‌

వెరిఫికేషన్‌ చేసిన పాలకవర్గం

మార్కెట్‌కు ప్రతిరోజూ ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులు అధికంగా వస్తాయి. మార్కెట్‌లో మొక్క జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల స్థలం సరిపోవడం లేదు. ఈ కేంద్రాన్ని మార్కెట్‌ పక్కనే ఉన్న సంతలో ఏర్పాటు చేయాలి.

– వై.ధీన్‌దయాళ్‌,

బీజేపీ నాయకుడు, తిరుమలగిరి

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డులోనే ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం పనులు చేపట్టడం అనాలోచిత నిర్ణయం. వెంటనే వాటి నిర్మాణాలు తొలగించి ఆ స్థలాన్ని రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు అందుబాటులోకి తేవాలి.

– కడెం లింగయ్య,

రైతు సంఘం నాయకుడు, తిరుమలగిరి

తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో స్థలం కొరత

ఫ ఏడాది పొడవునా పంట ఉత్పత్తుల రాక

ఫ సీజన్‌లో పోటెత్తుతున్న ధాన్యం

ఫ కొత్తగా మొక్కజొన్న

కొనుగోలు కేంద్రం ఏర్పాటు

ఫ ఇబ్బందులు పడుతున్న రైతులు, వ్యాపారులు

మధ్యలోనే ఆగిన ‘ఇంటిగ్రేటెడ్‌’ నిర్మాణం

ఈ వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఆవరణలోనే మున్సిపాలిటీకి సంబంధించిన వెజ్‌, నాన్‌ వెజ్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం కోసం 2023 సెప్టెంబర్‌ 5న ఎకరా స్థలంలో ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పనులు పిల్లర్ల వరకు పూర్తయి మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికే మార్కెట్‌లో స్థలం సరిపోవడం లేదనుకుంటే ఈ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం వల్ల మరో ఎకరం స్థలం వృథాగా పోతుంది. ఈ స్థలంలో 10 వేల నుంచి 15 వేల బస్తాల ధాన్యం పోయడానికి అవకాశం ఉండేదని రైతులు అంటున్నారు. అధికారులు స్పందించి మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని వేరేచోటకు మార్చి, ఇబ్బందులు లేకుండా మార్కెట్‌ నడిచేలా చూడాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement