ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

అర్వపల్లి: ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో బుధవారం ఎఫ్‌పీఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన యాప్‌ల ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో సమస్యలు తాండవిస్తున్నాయని తెలిపారు. తాలు, బెరుకుల సాకుతో మిల్లర్లు, నిర్వాహకులు రైతులను దొచుకుంటున్నారని ఆరోపించారు. లారీల కొరతతో కేంద్రాలలో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోతోందన్నారు. ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. సీఎం వెంటనే జోక్యం చేసుకొని ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, కొలిశెట్టి యాదగిరిరావు, మల్లు లక్ష్మి, ముల్కలపల్లి రాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్‌, పులుసు సత్యం, కోట రమేష్‌, స్కైలాబ్‌బాబు, దేవరకొండ యాదగిరి, వజ్జ వినయ్‌,బూర్గుల ప్రభాకర్‌ ఉన్నారు.

ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

Advertisement
 
Advertisement
Advertisement