హింసకు పాల్పడితే చర్యలు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

హింసకు పాల్పడితే చర్యలు : ఎస్పీ

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

సూర్యాపేటటౌన్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సమ్మె సమయంలో విధుల్లో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్రైవేట్‌ డ్రైవర్లు, కండక్టర్లు, బస్సుల యజమానులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, ఇళ్లపై దౌర్జన్యాలకు దిగడం వంటి ఘటనలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. సహాయం కోసం పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌: 8712686026, డయల్‌ 100కు కాల్‌చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement