గరిడేపల్లి : సమాజ ఉన్నతికి విద్య కీలకమని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఆదివారం గరిడేపల్లి మండల పరిధిలోని వెలిదండ గ్రామంలో గ్రామ విద్యాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను పూర్తి సౌకర్యాలతో నిర్వహించినప్పుడే ఉత్తమ సమాజం ఆవిష్కరించబడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య వేగంగా పడిపోతోందని, విద్యార్థులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించటానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల అభివృద్ధి ఎజెండాలో విద్య ముందుగా ఉండాలని పేర్కొన్నారు. తగినన్ని తరగతి గదులు, తగినంత మంది ఉపాధ్యాయులు, గ్రంథాలయం, ల్యాబ్‌లు, ఆట స్థలంతో పాఠశాలలు వికసిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయని విమలక్క, పోటు రంగారావు, అంబటి నాగయ్య, పోటు రామారావు, మేదరమట్ల వెంకటేశ్వరరావు, మేకల నాగేశ్వరరావు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు
ఫ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్
ఆకునూరి మురళి


