మానాపురం తండా నుంచి రూ.1400 కిరాయి పెట్టి ధాన్యం మార్కెట్‌కు తీసుకొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక మార్కెట్ బంద్ అని చెబుతున్నారు. మాకు ముందస్తు సమాచారం లేదు. మార్కెట్‌ను త్వరగా ప్రారంభించాలి.
– బోడ్యా, రైతు, మానాపురం తండా
వ్యవసాయ మార్కెట్ యార్డులో 500 కుటుంబాలు ప్రతిరోజు పని చేస్తున్నాయి. మార్కెట్ యార్డుతోనే జీవనోపాధి పొందుతున్నాం. మార్కెట్ బంద్ కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు స్పందించి ప్రతిరోజు మార్కెట్ యార్డు నడిచేలా చూడాలి.
–జీడి దాస్, హమాలీ యూనియన్ అధ్యక్షుడు


