నూతనకల్ : హిందూ ధర్మ పరిరక్షణకు అందరూ పాటుపడాలని వాసుదేవ సరస్వతి స్వామీజీ అన్నారు. సోమవారం నూతనకల్‌లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సత్యం, ధర్మం వంటి విలువలను ఆచరించడం దేశ ప్రగతికి అవసరమన్నారు. పంచపరివర్తనల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని సూచించారు. దేశంలో హిందూ సాంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శంభులింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చురుకంటి చంద్రారెడ్డి, సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్, ఆర్‌ఎస్‌ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాసం సత్యనారాయణ, ఉప సర్పంచ్ నాగం సరితసుధీర్‌రెడ్డి, కాప రవికుమార్, మద్ది సంజీవరెడ్డి, బండపల్లి సురేందర్‌గౌడ్, కందుకూరి భాగ్యలక్ష్మి, యాస ముత్తారెడ్డి, అనంతుల మల్లేశ్వరి పాల్గొన్నారు.


