సూర్యాపేటటౌన్ : మిల్లుల్లో ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని ఎస్పీ నరసింహ మిల్లర్లను ఆదేశించారు. శనివారం సూర్యాపేట రూరల్ పరిధి జనగామ రోడ్డులో ఉన్న వజ్ర రైస్ మిల్లులో ధాన్యం దిగుమతులను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వాహనాల నుంచి త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని మిల్లు యజమానులకు సూచించారు. రైతుల పక్షాన బాధ్యత తీసుకుని వారికి అండగా నిలవాలని కోరారు. మిల్లు యజమానులు, కార్మికులతో మాట్లాడి ధాన్యం దిగుమతి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ బాలునాయక్, సిబ్బంది ఉన్నారు.


