సూర్యాపేట : చిన్నారులు లలిత కళల్లో రాణించాలని జిల్లా బాల్ భవన్ కన్వీనర్, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కె.అశోక్ అన్నారు. ప్రజాపాలన–ప్రజా ప్రణాళికలో భాగంగా సూర్యాపేటలోని జిల్లా బాల్ భవన్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ (బి)లో విద్యా వారోత్సవాల సందర్భంగా ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ కల్చరల్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్, ఎస్‌ఓ సూర్యనారాయణ, హరికృష్ణ, పీడీ జెడ్పీహెచ్‌ఎస్ విఘ్నేశ్వరచారి, అభివృద్ధి కమిటీ సభ్యులు హమీద్ ఖాన్‌తో కలిసి డీఈఓ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారులు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయ నృత్యాలు లంబాడీ, కోలాటం, పేరిణి శివతాండవం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆర్ట్, క్రాఫ్ట్, కల్చరల్ డ్యాన్స్ పోటీలు నిర్వహించి వారిలో ఉత్తమ నైపుణ్యం చూపిన వారికి అతిథుల చేతుల మీదుగా మెమెంటో, సర్టిఫికెట్లు, గైడ్ టీచర్స్‌కి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలభవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ, సిబ్బంది దాసరి యల్లయ్య, ఉమారాణి, సత్యనారాయణ సింగ్, అనిల్, సాయి, వీరయ్య, పద్మ పాల్గొన్నారు.


