తాగు నీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

తాగు నీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన

Apr 30 2026 7:31 AM | Updated on Apr 30 2026 7:31 AM

సూర్యాపేట అర్బన్‌ : సూర్యాపేట మున్సిపల్‌ పరిధిలోని 15వ వార్డు భాగ్యనగర్‌ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆ కాలనీవాసులు బుధవారం ఖాళీ బిందెలతో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన కాలనీలోని నీటి సమస్యను తీర్చడం లేదని వాపోయారు. నెల రోజులుగా కనీస అవసరాలకు కూడా నీరు అందడం లేదని, గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి నీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. భాగ్యనగర్‌పై మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement