గుడిబండకు తరలిన రవాణా శాఖ కార్యాలయం | - | Sakshi
Sakshi News home page

గుడిబండకు తరలిన రవాణా శాఖ కార్యాలయం

May 7 2026 9:38 AM | Updated on May 7 2026 9:38 AM

కోదాడరూరల్‌ : ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కొనసాగుతున్న కోదాడ రవాణా శాఖ కార్యాలయం ఎట్టకేలకు బుధవారం గుడిబండ శివారులోని సొంత భవనంలోకి మారింది. ప్రభుత్వ గుడిబండ శివారులోని లెప్రసీ వైద్యశాలలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో అధికారులు కార్యాలయాన్ని అక్కడి తరలించారు. అక్కడ ఉన్న పాత భవనానికి మరమ్మతులు చేసి కార్యకలాపాలు ప్రారంభించారు. ఇక నుంచి వాహనదారులు గుడిబండకు రావాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ ఎన్‌.వాణి, డీటీఓ జయప్రకాశ్‌రెడి, ఎంవీఐ ఎస్‌కె.జిలానీ, సిబ్బంది పాల్గొన్నారు.

ఆలయ భూముల

కౌలుపై బహిరంగ విచారణ

హుజూర్‌నగర్‌ : అమరవరంలోని శ్రీఅమరలింగేశ్వరస్వామి ఆలయ భూముల కౌలు విషయమై బుధవారం ఆలయ ఈఓ గుజ్జుల కొండారెడ్డి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అర్చకులకు చెందిన భూముల కౌలు విషయంలో కొందరు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏసీ ఆదేశాల మేరకు ఉపసర్పంచ్‌ కర్నాటి వీర నాగిరెడ్డి, ఆలయ అర్చకులు, గ్రామస్తుల సమక్షంలో బహిరంగ విచారణ జరిపినట్లు ఆయన చెప్పారు. విచారణ నివేదికను ఏసీకి సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. అర్చకులు ఎల్‌.లక్ష్మమ్మ, నగేష్‌శర్మ, పాల్గొన్నారు.

నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తేనే గుర్తింపు

నకిరేకల్‌ : ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తేనే ప్రజాప్రనిధులకు మంచి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్‌ మున్సిపల్‌ పాలవర్గం ఐదేళ్ల పదవీకాలం బుధవారంతో ముగియడంతో మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో పాలకవర్గానికి ఏర్పాటు చేసిన వీడ్కోలు, సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించి మాట్లాడారు. రాజకీయ నాయకులకు పదవీ విరమణ అనేది ఉండదని, రాబోయే రోజుల్లోనూ మరిన్ని పదవులు అధిరోహించేలా ప్రజలకు సేవలందించాలన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చౌగోని రజితా శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, కౌన్సిలర్లు కందాల భిక్షంరెడ్డి, రాచకొండ సునీల్‌, గాజుల సుకన్య, పన్నాల పావని శ్రీనివాస్‌రెడ్డి, యాసారపు లక్ష్మీవెంకన్న, మట్టిపల్లి కవితా వీరు, గర్శకోటి సైదులు, పోతుల సునీత రవీందర్‌, చౌగోని అఖిల లక్ష్మీనారయణ, చౌగోని రాములమ్మ సైదులు, గడ్డం స్వామి, వంటెపాక సోమలక్ష్మి, బానోతు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement