సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నాం ద్వితీయ సంవత్సరం పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల్లో ఎలాంటి మాస్ కాఫీయింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోనున్నట్టు ఇంటర్మీడియట్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సం విద్యార్థులు కలిపి మొత్తం 7142 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలను రాయాలి. ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. పరీక్షలు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాం. పరీక్ష కేంద్రాల సమీపంలోని జీరాక్స్ సెంటర్లను మూసి వేయాలి. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది.
– సులోచన రాణి, డీఐఈవో
ఫ 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు
ఫ హాజరు కానున్న
7,142 మంది విద్యార్థులు


