ఎస్‌బీఐ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

సూర్యాపేట : ఆల్‌ ఇండియా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్టాఫ్‌ ఫెడరేషన్‌ పిలుపులో భాగంగా శుక్రవారం సూర్యాపేట రీజియన్‌ కార్యాలయం వద్ద ఎస్‌బీఐ యూనియన్‌ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన 16 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. మూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన మెసెంజర్ల నియామకాలు చేపట్టాలని, ఆర్మ్‌డ్‌ గార్డుల నియామకం, ఎన్‌పీ ఉద్యోగులకు పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్‌ మార్చుకునే అవకాశం కల్పించాలని కోరారు. 2019 తరువాత నియమితులైన ఉద్యోగులకు ఇంటర్‌ సర్కిల్‌ బదిలీలు చేపట్టాలని, ఔట్‌సోర్సింగ్‌ నియామకాలు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సూర్యాపేట రీజినల్‌ సెక్రటరీ అయితగోని మహేష్‌, సురేష్‌, నవీన్‌, క్రాంతి, కిశోర్‌, ప్రియాంక, చందు, కిరణ్‌, నవ్య, పుష్ప, మమత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement