నాగమల్లు జీవితం యువతకు ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

నాగమల్లు జీవితం యువతకు ఆదర్శం

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

నాగారం : ప్రజల కోసం నిరంతరం తన కలం, గళంతో పోరాటాలు నిర్వహించిన సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ డివిజన్‌ కమిటీ సభ్యుడు, అరుణోదయ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తడకమళ్ల నాగమల్లు జీవితం యువతకు ఆదర్శమని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం నాగారం మండలం లక్ష్మాపురంలో నిర్వహించిన తడకమళ్ల నాగమల్లు సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డేవిడ్‌కుమార్‌ మాట్లాడుతూ నాగమల్లు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, న్యూడెమోక్రసీ పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్‌, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయగిరి, ఏఐకేఎంఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్‌, ఐఎఫ్‌టీయూఐ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అలుగుబెల్లి వెంకటరెడ్డి, పోలేబోయిన కిరణ్‌కుమార్‌, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచనపల్లి సైదులు, ఎర్ర ఉమేష్‌, గండు నగేష్‌, సామ నర్సిరెడ్డి, దాసరి శ్రీనివాస్‌, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు పుల్లూరు సింహాద్రి, సర్పంచ్‌ రవీందర్‌, మాజీ సర్పంచ్‌ సుధాకర్‌, మల్లెపాక వెంకన్న, కళాకారులు అనుదీప్‌, మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement