వైద్యులు సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యులు సమయపాలన పాటించాలి

Apr 24 2026 6:44 AM | Updated on Apr 24 2026 6:44 AM

రైతులకు ఇబ్బందులు తలెత్తొద్దు

మునగాల : ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ సిబ్బందిని ఆదేశించారు. మునగాల మండలంలోని బరాఖత్‌గూడెం శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తూకం, తేమ శాతం పరీక్షలు, రవాణా సౌకర్యాలపై ఆరా తీసి మాట్లాడారు. కొనుగోలు ప్రక్రియలో లోపాలు ఉండకూడదని సిబ్బందికి సూచించారు. కేంద్రంలో రైతులకు అన్ని వసతులు కల్పించాలని చెప్పారు.

హుజూర్‌నగర్‌ : ప్రభుత్వ వైద్యులు విధి నిర్వహణలో సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. గురువారం హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు విభాగాలను పరిశీలించారు. పలువురు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది సమయం కాకముందే విధుల నుంచి వెళ్లిపోవడంపై కలెక్టర్‌ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్యులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు అధికంగా జరిగేలా చూడాన్నారు. ఆసుపత్రి పారిశుద్ధ్య నిర్వహణపై శానిటేషన్‌ సిబ్బందిని, నర్సింగ్‌ ఆఫీసర్లను అభినందించారు. కాయకల్పలో అవార్డు పొందాలని ఆకాక్షించారు. నూతనంగా నిర్మిస్తున్న ఓపి బ్లాక్‌ నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్‌డీఓ శ్రీనివాసులు, హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ రవి కుమార్‌, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ వనజ, వైద్యులు, నర్సింగ్‌ ఆఫీసర్లు, శానిటేషన్‌ సిబ్బంది ఉన్నారు.

మొక్కలు ఎండిపోకుండా చూడాలి

హుజూర్‌నగర్‌ : ఎండల తీవ్రత దృష్ట్యా మోడల్‌ కాలనీలో నాటిన మొక్కలు ఎండిపోకుండా చూడాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ సూచించారు. హుజూర్‌నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న మోడల్‌ కాలనీ ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. మోడల్‌ హౌసింగ్‌ కాలనీలో విద్యుత్‌ పనులు, వీధిదీపాలు ఏర్పాటు, గ్రీనరీ, తాగునీరు, పైలాన్‌ స్థూపం, సభాస్థలిని ఆయన పరిశీలించి మాట్లాడారు. కాలనీలో మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, హౌసింగ్‌ పీడీ సిద్ధార్థ, హర్టికల్చర్‌ పీడీ నాగయ్య, విద్యుత్‌ డీఈ వెంకటకిష్టయ్య, వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement