ప్రమోషన్లతో కూడిన బదిలీలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ప్రమోషన్లతో కూడిన బదిలీలు చేపట్టాలి

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

మద్దిరాల : ఉపాధ్యాయులకు జూలైలో ప్రమోషన్లతో కూడిన బదిలీలు చేపట్టాలని డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలన్నారు. ప్రైవేటు పాఠశాలలను నియంత్రించాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఒకే యాజమాన్యం కిందికి తీసుకు రావాలని కోరారు. ఉపాధ్యాయులకు కొత్త హెల్త్‌ స్కీంను మే ఒకటో తేదీ నుంచి అమలు చేయాలన్నారు. రూ.13వేల కోట్ల నిధులు ఒకే విడతగా విడుదల చేసి పెండింగ్‌ బిల్లులన్నీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు జి.రాములు, ప్రధాన కార్యదర్శి కె.ఉమేష్‌రెడ్డి, సంఘం సభ్యులు కొరివి మధు, పి.సురేష్‌, ఏ.విజయ్‌, ఎండీ.అలీమొద్దీన్‌, షరీఫ్‌, నాగేష్‌, ఎల్‌.గోవింద్‌, శివప్రసాద్‌, శ్రీనివాస్‌రెడ్డి, శిల్ప, శిరీష, శుష్మ, సరిత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement